Wednesday, 12 October 2016

మరకత మణి గురించి తెలుసా! తెలుసుకోండి.

 

  

ఈ జాతిపచ్చ ప్రత్యేకత : మరకతము నవరత్నములలో ఒకటి. పచ్చలు అని తెలుగులో దీనికి గల వ్యావహారిక నామము. అమర కోశములో గారుత్మతం మరకత మశ్మ గర్భోహరిన్మణి అని వివరణ కలదు. గరుత్మంతుని వలన ఉద్బవించినది, కావున, "గారుత్మతం" 'రాయి'నుండి ఉద్బవించినది కావున, అశ్మ గర్భ. పచ్చని రంగును కలిగి ఉన్నది కావున హరిన్మణి, "పచ్చ", "పచ్చలు" అన్న పేర్లు కలవు.

ఇది ఎనిమిది రంగులలో ఉంటుంది. దీనిని ధరించడం వలన మంత్ర తంత్ర బాధలు కలుగవు. ధనలాభం ఇస్తుంది. దృష్టి దోషాలను పోగొడుతుంది. ఆశ్లేష, జేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు ధరించవచ్చు. పూజిస్తే ఇంకమంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉన్మాదం, పిచ్చి, విష ప్రయోగాలను ఇది హరింపజేస్తుంది.

తెలుసుకోవడం ఎలా?
ఈ జాతి పచ్చ మంచిదో కాదో తెలుసుకోవాలంటే! సూర్యునికి ఎదురుగా పెట్టినప్పుడు దీని కాంతి నలుదిక్కులా ప్రసరిస్తుంది.బంగారం, తెల్లని ముత్యము, తెల్లని వస్త్రం పై ఉంచినపుడు వాటిని తన రంగుతో ప్రతిఫలింపజేస్తుంది.



తమిళనాడులోని తిరుక్కువలై లో గల బ్రహ్మపురీశ్వరాలయంలో వెయ్యేళ్ళ నాటి మరకత శివలింగ చోరీకి గురైంది. సోమవారం సాయంత్రం ఆలయంలోకి ప్రవేశించిన అర్చకుడు ఈ మరకత శివలింగం ఉండే పెట్టె పగిలి ఉండడం చూసి వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మూడు ప్రత్యెక బృందాలను నియమించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఈ చోరికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ మరకత శివలింగాన్ని వెయ్యేళ్ళ క్రితం చోళ రాజైన రాజేంద్ర చోళుడు తూర్పు ఆసియా నుండి ప్రత్యేకమైన ఈ పచ్చరాతిని తెప్పించి తాయారు చేయించారు.

No comments:
Write comments

Total Visitors

Pages

FB Page & Web Site Links

Follow Us